దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో NDA కూటమి సత్తా చాటింది. 15 రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ సీట్లకు, 2 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. కేరళలోని వయనాడ్ ను కాంగ్రెస్, మహారాష్ట్రలోని నాందేడ్ ను BJP దక్కించుకున్నాయి.
ఉత్తరప్రదేశ్…: తొమ్మిదికి గాను 6 చోట్ల BJP, రెండు చోట్ల సమాజ్ వాదీ గెలుపొందాయి.
బిహార్…: నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ BJP కూటమిదే హవా. తరారీ, రామ్ గఢ్, బేలాగంజ్, ఇమామ్ గంజ్ ను గెలుచుకుంది.
రాజస్థాన్…: ఏడు శాసనసభ స్థానాల్లో ఐదింటిని భారతీయ జనతాపార్టీ దక్కించుకుంది.
పశ్చిమబెంగాల్…: ఆరింటికి ఆరు తృణమూల్ కాంగ్రెస్(TMC) ఖాతాలో చేరాయి.
కర్ణాటక…: కర్ణాటకలో మూడుకు మూడింటిని కాంగ్రెసే కైవసం చేసుకుంది.
పంజాబ్…: మొత్తం నాలుగు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడింటిని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP), ఒకటి కాంగ్రెస్ సాధించాయి.
కేరళ…: కేరళలో రెండు స్థానాలకు గాను ఒకచోట కాంగ్రెస్, మరోచోట CPM గెలుపొందాయి.
అసోం…: నాలుగు సీట్లకు ఎన్నికలు జరిగితే రెండు BJP, ఒకటి కాంగ్రెస్, ఒకటి AGP(అస్సాం గణ పరిషత్) గెలుచుకున్నాయి.
గుజరాత్…: ఏకైక సీటు కమలం వశమైంది.