BJP-ఆమ్ ఆద్మీ మధ్య ఓ ‘కాకి’ ఇష్యూ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అసలే పార్లమెంటు సమావేశాలు.. BJPపై అవిశ్వాస తీర్మానం.. విపక్ష సభ్యుల తీరుపై మోదీ సహా ఆ పార్టీ లీడర్లంతా ఫైర్ అవుతున్నారు. ఈ సమయంలోనే ఆ పార్టీకి ఒక ఆయుధం దొరికింది. అదే.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా. ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్సే ట్రోలింగ్స్. పార్లమెంటు ప్రాంగణం(Premises)లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) MP రాఘవ్ చద్దాకు వింత అనుభవం ఎదురైంది. సమావేశాల్లో మాట్లాడి వస్తుండగా ఒక కాకి ఆయనపై దాడి చేసింది. మీటింగ్ హాల్ నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వస్తున్న సమయంలో కాకి ఉన్నట్టుండి MP పైకి దూసుకువచ్చింది. దీంతో షాక్ తిన్న ఆయన దాన్నుంచి తప్పించుకునేందుకు తలను బెండ్ చేశారు. ఆ సమయంలో పీటీఐ ఫొటోగ్రాఫర్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫొటోలు తీశారు. అసలే BJPకి AAPకు ఓ పట్టాన పడదు.
ఇంకేముంది.. ఆ ఫొటోలతో BJP ఓ ఆట ఆడుకుంది. BJP దిల్లీ వింగ్.. ట్విటర్ లో ఆ ఫొటోను షేర్ చేస్తూ ‘ఝూట్ బోలే కవ్వా కాటే'(‘అబద్ధాలు ఆడటం వల్లే కాకి కాటు వేసింది’) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ‘ఆజ్ తక్ సిర్ఫ్ సునా థా.. ఆజ్ దేఖ్ భీ లియా కవ్వా నే ఝూటే కా కాటా(ఇప్పటిదాకా కేవలం విన్నాం.. కానీ అబద్ధమాడితే కాకి తన్నుతుందని ఈ రోజే చూశాం)’ అంటూ మీమ్స్ తో హోరెత్తించింది. ఇది కాస్తా కొద్ది సమయంలోనే వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు, మీమ్స్ తో హాట్ టాపిక్ లా మార్చారు. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాకు కాబోయే భర్త రాఘవ్ చద్దా.