వక్ఫ్ బిల్లు(Waqf Bill)ను కేంద్రం రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముంది. ఇందుకోసం పార్టీ లోక్ సభ సభ్యులందరికీ విప్ జారీచేసింది BJP. విపక్షాల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉండటంతో అందుకు సంబంధించిన జాగ్రత్తలపై దృష్టిపెట్టింది. బడ్జెట్ సెషన్ చివరి నాలుగు రోజుల్లో ఇదే హాట్ టాపిక్ కానుంది. దీంతో MPలందరూ ఏప్రిల్ 2న తప్పసరి(Mandatory)గా హాజరు కావాలంటూ విప్ జారీ చేసింది. ఈ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)కి దేశంలోనే అత్యధికంగా ప్రతిపాదనలు వచ్చాయి. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ కూటమి సైతం సమావేశమైంది. మరిన్ని వార్తలకు https://justpostnews.com క్లిక్ చేయండి.