
ఢిల్లీ ఎర్రకోట మెట్రోస్టేషన్ వద్ద జరిగిన పేలుడులో 8 మంది మరణించారు. మరో 12 మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 10 వాహనాలు కాలిపోయాయి.పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమై భీతావహ పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ అంతటా సైరన్లు మోగుతున్నాయి. 20 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. మెట్రో స్టేషన్ గేట్ నంబర్-1 వద్ద పేలుడు జరిగినట్లు గుర్తించారు. తొలుత ఫైర్ సిబ్బందికి సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. సాయంత్రం 6:45 గంటలకు ఘటన జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు.