ఆమె రెండుసార్లు సివిల్స్ ప్రాథమిక పరీక్ష(Prelims) దాటలేదు.. మూడో ప్రయత్నంలో మెయిన్స్ లో ఫెయిల్.. కానీ నాలుగోసారికి అన్ని పరీక్షల్లో పాసై ఆల్ ఇండియా(AIR)లో 569 ర్యాంక్ సాధించారు. ఇందుకు కారణం.. మూడోసారి ఫెయిలైన తర్వాత మూడేళ్లు ఫోన్ కు దూరంగా ఉండటమే. గుజరాత్ కేడర్ IAS, 25 ఏళ్ల నేహ బ్యద్వాల్(Neha Byadwal) విజయగాథ ఇది. రాజస్థాన్ లో పుట్టి ఛత్తీస్ గఢ్ రాయపూర్ లో పెరిగిన నేహ.. ఐదో క్లాసులోనే ఫెయిలయ్యారు. సవాళ్లు ఎదుర్కోవడాన్ని అప్పుడే గుర్తించారు. https://justpostnews.com
తండ్రి సివిల్స్ రాసి IT అధికారి కాగా, ఆయనలాగే కావాలనుకున్నారామె. మొబైల్ పక్కనపెట్టి రోజుకు 17-18 గంటలు చదివి 960 మార్కులతో 24 ఏళ్లకే IAS సాధించారు. టూర్, షాపింగ్.. ఇలా దేన్నీ త్యాగం చేయొద్దని, ఇంటికి వచ్చాక మీ దృష్టంతా చదువుపైనే ఉంచాలంటున్నారు. తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా రోజూ 30 నిమిషాలు పిల్లలకు కేటాయించాలని, తన తండ్రి అలా చేయడం వల్లే IAS సాధించానన్నారు.