భారత్ పట్ల వ్యతిరేక వైఖరి కనబర్చిన మాల్దీవులు, హిందువులపై దాడులకు పాల్పడుతూ అరాచకం జరుగుతున్న బంగ్లాదేశ్ తోపాటు వివిధ దేశాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఒక్కో దేశానికి కేటాయించిన నిధుల వివరాల్ని విడుదల చేశారు. భూటాన్ కు అత్యధికంగా రూ.2,150 కోట్లు ఇవ్వనున్నారు. ఇక మాల్దీవులకు గత బడ్జెట్ కన్నా ఎక్కువగా అందజేయనున్నారు. గతంలో రూ.470 కోట్లు ఉంటే ఇప్పుడది రూ.600 కోట్లు అయింది. బంగ్లాదేశ్ కు రూ.120 కోట్లు, మంగోలియాకు అత్యల్పంగా రూ.5 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. నేపాల్ కు రూ.700 కోట్లు, మయన్మార్ కు రూ.350 కోట్లు, శ్రీలంకకు రూ.300 కోట్లు, ఆఫ్రికా దేశాలకు రూ.225 కోట్లు, అఫ్గానిస్థాన్ కు రూ.100 కోట్ల చొప్పున కేటాయింపులు జరిగాయి.