బస్సు 40 అడుగుల లోయలో పడటంతో 15 మంది మృత్యువాత పడగా, మరో 12 మందికి గాయాలైన ఘటన ఛత్తీస్ గఢ్(Chhattisgarh)లో జరిగింది. దుర్గ్ ప్రాంతంలోని డిస్టిలరీ(Liquor) కంపెనీలో విధులు(Duties) ముగించుకుని తిరిగి వెళ్తుండగా శివారులోని ఖప్రీ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ చేతి నుంచి బస్సు అదుపుతప్పి మైనింగ్ నుంచి తవ్విన మొరం గడ్డను తొలుత ఢీకొట్టింది.
రాత్రి పూట…
బాగా చీకటిగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్రంగా ఇబ్బంది ఏర్పడింది. అయినా గాయపడ్డవారిని వెంటనే స్థానికులు దగ్గర్లోని దవాఖానా(Hospital)కు తరలించారు. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రికి చేర్చేలోపే 11 మంది మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. బాధితుల్లో మరో ఆరుగురి పరిస్థితి(Condition) విషమం(Serious)గా ఉందంటున్నారు.
దిగ్భ్రాంతి…
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ సంతాపం ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించాలని విష్ణుదేవ్ సాయ్ ని ప్రధాని ఆదేశించారు.