ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందగా.. 19 మందికి గాయాలయ్యాయి. లఖ్నవూ-ఆగ్రా జాతీయ రహదారి(Highway)పై ఉన్నావ్(Unnao) వద్ద పాల ట్యాంకర్ ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. బాధితుల్ని బంగర్మావ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెల్లవారుజామునే…
బిహార్లోని సీతామర్హి నుంచి నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు అతివేగం(Over Speed)గా పాల ట్యాంకర్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ స్పీడ్ కు బస్సులో ఉన్నవాళ్లంతా ఎగిరిపడ్డారు. ప్రమాద ఘటనపై UP ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ అధికారుల్ని వివరాలడిగి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రధాని ఆరా…
రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున కేంద్రం పరిహారం ప్రకటించింది.