
రైతుల ఖాతాల్లో PM కిసాన్ నిధులు జమ చేసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంటలకు మద్దతు ధర కల్పించాలన్న ఉద్దేశంతో వాటి రేట్లను పెంచుతూ కేబినెట్(Cabinet) తీర్మానించింది. దీంతో ఈ ఖరీఫ్ లో 14 రకాల పంటలకు మద్దతు ధరలు(Minimum Support Price) దక్కుతుంది. వరి(Paddy)కి మరో రూ.117 పెంచింది.
పంటలు ఇలా…
మొక్కజొన్న, పత్తి, రాగి, జొన్నతోపాటు మొత్తం 14 రకాల పంటలకు మద్దతు ధరను కేంద్ర కేబినెట్ పెంచింది. ఇప్పటిదాకా వరికి రూ.2,183గా ఉంటే ప్రస్తుతం రూ.117తో క్వింటాలు ధాన్యానికి రూ.2,300కు అయింది.
పెరిగిన ధరలు క్వింటాలుకు రూపాయల్లో ఇలా…
| పంట పేరు | పెరిగిన ధర |
| గడ్డి నువ్వులు(Niger) | 983 |
| నువ్వులు(Sesamum) | 632 |
| కందులు(Tur/Arhar) | 550 |
| పొద్దుతిరుగుడు(Sunflower) | 520 |
| పత్తి(Cotton) | 501 |
| మినుములు(Urad) | 450 |
| రాగులు(Ragi) | 444 |
| వేరుశెనగ(Groundnut) | 406 |
| సోయాబీన్(Soybeen) | 292 |
| జొన్న మల్దాండ్ని(Jowar Maldandni) | 196 |
| జొన్న(Jowar Hybrid) | 191 |
| మొక్కజొన్న(Maize) | 135 |
| సజ్జలు(Bajra) | 125 |
| పెసర(Moong) | 124 |
| వరి(Paddy) | 117 |