వివాదాస్పద వక్ఫ్(Waqf) బిల్లు సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) ఫిబ్రవరి 19 నాటి భేటీలో లేవనెత్తిన 14 మార్పులకు కేబినెట్ ఓకే చెప్పింది. తన తుది నివేదికను JPC ఫిబ్రవరి 13న సమర్పించింది. గత 6 నెలల్లో 36 విచారణలను JPC నిర్వహించింది. తృణమూల్ MP కల్యాణ్ బెనర్జీ, BJP నేత అభిజిత్ గంగోపధ్యాయ మధ్య తీవ్రమైన వాగ్వాదం.. భౌతిక దాడికి దారితీసింది. ఇలా గందరగోళం నడుమ 66 మార్పులను ప్రతిపాదించగా, అందులో 44 అంశాల్ని తిరస్కరించారు. JPCలో 16 మంది BJP, విపక్షాల నుంచి 10 మంది MPలు ఉన్నారు. ముస్లిం ధార్మిక ఆస్తులను ఎలా నిర్వహించాలో.. కేంద్ర, రాష్ట్ర వక్ఫ్ బోర్డులను నియంత్రించే చట్టాలకు మార్పులు.. వంటి ప్రతిపాదనలు వచ్చాయి.