Published 29 Nov 2023
వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోదీ సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహిళలకు చేయూత అందించే లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల(Self Help Groups)కు డ్రోన్లు అందించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 15 వేల డ్రోన్లను SHG గ్రూపులకు ఇవ్వనుండగా, వ్యవసాయ పనుల కోసం వీటిని వాడాల్సి ఉంటుంది. ఈ డ్రోన్లను అద్దె రూపంలో రైతులకు ఇచ్చుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
మరో ఐదేళ్లపాటు కంటిన్యూ
ఉచిత రేషన్, గరీబ్ కల్యాణ్ యోజనను ను మరో ఐదేళ్లు పొడిగించడంతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ 5 కిలోల చొప్పున ఉచిత రేషన్ ఇవ్వాలని డిసైడ్ అయింది.