దేశవ్యాప్తంగా ప్రధాన చర్చకు నిలిచిన జమిలి ఎన్నికల(One Election)ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. గ్రామపంచాయతీల నుంచి పార్లమెంటు వరకు ఏకకాలంలో ఎన్నికలు(Elections) నిర్వహించే లక్ష్యంతో తీసుకువస్తున్న జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే దీన్ని సభలో ప్రవేశపెట్టడానికి మార్గం సుగమమైంది. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు సై అని చెప్పిన కేంద్రం… ఇప్పటికే దానిపై పలుసార్లు సమీక్ష నిర్వహించింది.
దీనిపై అన్ని పార్టీలు, రాష్ట్రాల నుంచి ఆమోదం లభించేలా జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) వేయాలన్న ఆలోచనలోనూ మోదీ సర్కారు ఉంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితా(Voter List) తయారీకి కేంద్రం అడుగులు వేస్తుండగా.. ఇది అమలు కావాలంటే రాజ్యాంగంలో 18 సవరణలు చేయాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతు తెలిపితే, 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.