జమిలి ఎన్నికలపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విధానానికి కేంద్ర కేబినెట్(Union Cabinet) ఆమోదం తెలపగా… ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కమిటీ రిపోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హోంమంత్రి అమిత్ షా నిన్ననే దీని గురించి మాట్లాడగా.. 24 గంటల్లోనే నిర్ణయం వెలువడింది. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు బిల్లు రానుంది.
వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులు, త్వరలో ఆయా రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్ని పరిగణలోకి తీసుకుని ఈ జమిలి ఎన్నికల పర్యవసానాల్ని అంచనా వేయనున్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్, హర్యానాకు ఎన్నికలు జరుగుతుండగా.. ఈ నవంబరులో మహారాష్ట్ర, జార్ఖండ్ కు నిర్వహించాల్సి ఉంది. 2025 తొలి మూణ్నెల్లలోనే మరిన్ని రాష్ట్రాలకు ఎలక్షన్లు జరగాల్సి ఉండగా.. వీటన్నింటికీ అనుసరించాల్సిన విధివిధానాల్ని పరిశీలించాల్సి ఉంది.