గుండె వ్యాధుల వైద్యుడు(Cardiac Surgeon) ఆస్పత్రిలో రోగుల్ని పరిశీలిస్తూ గుండెపోటుతోనే ప్రాణాలు విడిచారు. చెన్నె సవిత మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న 39 ఏళ్ల గ్రాడ్లిన్ రాయ్.. ఉన్నట్టుండి కింద పడిపోయారు. వెంటనే సహచర డాక్టర్లు ఆయనకు CPRతోపాటు స్టెంట్లతో యాంజియోప్లాస్టీ, ఇంట్రా ఆర్టిక్(Intra-Aortic) బెలూన్ పంప్ వంటి చికిత్సలు అందించినా లాభం లేకుండా పోయింది. యువ డాక్టర్లలో ఉన్న ఒత్తిడికి ఈ ఘటనే నిదర్శనమని ఆయన కొలీగ్ అయిన హైదరాబాద్ న్యూరాలజిస్ట్ డా.సుధీర్ కుమార్ అన్నారు. రోజుకు 12-18 గంటలు, కొన్నిసార్లు ఒకే షిఫ్టులో 24 గంటలు పనిచేయడం ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.