దేశవ్యాప్తంగా వర్షాలు హడలెత్తిస్తున్నాయి. ఉత్తరాదిలో క్లౌడ్ బరస్ట్, కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కుంభవృష్టి. ఇప్పుడు గుజరాత్ లోనూ భారీ వర్షాలు అన్నింటినీ ముంచేశాయి. హిమ్మత్ నగర్(Himmatnagar) ప్రాంతం విలాసమైన భవనాలకు కేంద్రం. కానీ వర్షానికి తెలియదుగా అవన్నీ విల్లాలు, అత్యాధునిక కార్లని. వాహనాల రూఫ్ మాత్రమే కనపడిందంటే కుండపోత ఎలా ఉందో అర్థమవుతుంది. శాస్త్రినగర్, షాగూన్ బంగ్లాస్, ఛపరీయా చార్ రాస్తా ప్రాంతాల హౌజింగ్ సొసైటీల్లోని భారీ బిల్డింగ్ లు నీటమునిగాయి.