మణిపూర్ లో మహిళల వేధింపులపై CBI దర్యాప్తు చేయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఫారసులు చేయాలని చూస్తోంది. జాతుల ఘర్షణతో అట్టుడుకుతున్న మణిపూర్ లో మహిళలపై జరిగిన దారుణాలు ఈ మధ్యకాలంలో వరుసగా వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనలపై విపక్షాలతోపాటు వివిధ వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనూ మణిపూర్ అంశాన్నే ప్రధాన అస్త్రంగా విపక్షాలు చేసుకున్నాయి. ప్రధాని దీనిపై ప్రకటన చేయాలని పట్టుబట్టి నో కాన్ఫిడెన్స్ మోషన్ కు తీర్మానించాయి.
వీటిపై సీరియస్ గా దృష్టిసారించిన కేంద్ర ప్రభుత్వం మణిపూర్ ఘటనలకు ముగింపు పలకాలన్న ఉద్దేశంతో CBI ఇన్వెస్టిగేషన్ కు సిఫారసు చేసింది. మణిపూర్ అల్లర్ల వెనుక ఇతర కుట్రలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఈ CBI ఇన్వెస్టిగేషన్ ద్వారా బయటపడే అవకాశముంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ డిసిషన్ కు వచ్చి ఉండవచ్చు.