ట్రిపుల్ తలాక్ ఆచారం వివాహ వ్యవస్థకు ప్రాణాంతకరం(Dangerous) అన్న కేంద్ర ప్రభుత్వం… ఇందుకోసం కఠిన చట్టం తేవాల్సిన అవసరముందని చెప్పింది. కొన్ని ముస్లిం వర్గాలలో చెల్లుబాటయ్యే ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని 2017లో సుప్రీంకోర్టు పక్కన పెట్టడం ద్వారా విడాకుల సంఖ్యను తగ్గించడంలో పెద్దగా మార్పు కనపడలేదని తెలిపింది.
ట్రిపుల్ తలాక్ ను సుప్రీం చెల్లుబాటు చేయనందున నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదంటూ దాఖలైన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court)లో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
బాధితులు పోలీసులను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదని, ముస్లిం మహిళల పరిస్థితి దయనీయమైన ఈ ఆచారంపై కఠిన చట్టం లేకపోవడం వల్ల భర్తలపై ఎలాంటి చర్యలు తీసుకోలేక పోలీసులు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారని తెలిపింది. దీన్ని నివారించాలంటే చట్టపరమైన నిబంధనలు తక్షణావసరమని వివరించింది.