వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన రెండు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు రూ.3,300 కోట్లు అందజేయనుంది. నిన్న APలో, ఈరోజు తెలంగాణలో ఏరియల్ సర్వే నిర్వహించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. నష్టం జరిగిన తీరును మరో మంత్రి బండి సంజయ్ తో కలిసి పరిశీలించారు.
ఉమ్మడి ఖమ్మంతోపాటు, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో భారీ నష్టం జరిగింది. ఇప్పటికే వివిధ వర్గాలతో భేటీ అయిన కేంద్ర మంత్రుల బృందం.. CM రేవంత్ రెడ్డితోపాటు రివ్యూ నిర్వహించింది.