అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ కు భారీగా భద్రతా బలగాల్ని(Security Forces) పంపాలని కేంద్రం నిర్ణయించింది. CAPF(సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్)కు చెందిన 50 కంపెనీల బలగాల్ని కేంద్ర హోంశాఖ పంపనుంది. హోంమంత్రిత్వ శాఖ బృందం మణిపూర్లో పర్యటించిన తర్వాత అమిత్ షా సమీక్ష నిర్వహించారు. హింస(Violence)కు కారణమవుతున్న జిరిబామ్ ప్రాంతంలోని 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో సెక్యూరిటీని భారీగా పెంచబోతున్నారు. ఏడాది నుంచి మెజారిటీ హిందూ మైతేయిలు, క్రిస్టియన్ కుకీల మధ్య అగ్గి రాజుకుంటున్న దృష్ట్యా రెండ్రోజుల క్రితం BJP MLA ఇంటిపై దాడి జరిగింది.
గతవారం కుకీ మిలిటెంట్ల దాడిలో ముగ్గురు మహిళలు, మరో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఘర్షణలు జరుగుతున్నాయి. పోలీసులు, నిరసనకారుల(Protesters) మధ్య గొడవలో ఒక వ్యక్తి కాల్పుల్లో చనిపోయాడు. బీరేన్ సింగ్ ప్రభుత్వంపై విమర్శలు రావడం.. BJP కూటమికి NPP దూరంగా ఉండటానికి తోడు పరిస్థితి చేయిదాటిపోవడంతో భారీగా బలగాల్ని కేంద్రం పంపనుంది.