క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నేతల అనర్హతపై కేంద్రం సంచలన వివరణ ఇచ్చింది. జీవితకాల నిషేధం(Lifetime Ban) కఠినమని, ఆరేళ్ల వ్యవధి చాలని తెలిపింది. పూర్తి నిషేధంతోపాటు కేసుల్ని త్వరగా తేల్చాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టుకు కేంద్రం అఫిడివిట్ సమర్పించింది. అనర్హత వ్యవధిని నిర్ణయించడం పూర్తిగా పార్లమెంటు పరిధిలోనిదని తెలిపింది. జీవితకాల నిషేధం కరెక్టా, కాదా.. అనర్హత పదం విస్తృతి, సూత్రాలను పరిగణలోకి తీసుకుని సభ నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8(1) ప్రకారం శిక్షను వివరించింది.
దోషిగా నిర్ధారించిన తేదీ నుంచి ఆరేళ్లు లేదా జైలు శిక్ష అనుభవించి విడుదలైన తేదీ నుంచి 6 సంవత్సరాలు అని పేర్కొంది. సెక్షన్ 9 ప్రకారం.. ఉద్యోగులైతే తొలగింపు తేదీ నుంచి ఐదేళ్ల పాటు అనర్హులు. ఈ రెండు సందర్భాల్లోనూ డిస్ క్వాలిఫై జీవితాంతం ఉండాలన్నది పిటిషనర్ వాదన. ఇది విస్తృత వాదన కనుక పార్లమెంటు ద్వారా మాత్రమే న్యాయ సమీక్ష రూపురేఖలు మార్చాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టతనిచ్చింది.