ప్రభుత్వ ఉద్యోగులు(Servants) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(R.S.S.S) కార్యక్రమాల్లో పాల్గొనేలా కేంద్ర ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. 58 సంవత్సరాల నిషేధాన్ని పక్కనపెట్టి సరికొత్త ఉత్తర్వులు(Orders) ఇచ్చింది. 1966, 1970, 1980లో ఇచ్చిన ఆర్డర్స్ మేరకు సర్కారీ ఉద్యోగులు RSS కార్యకలాపాల్లో పాల్గొనడం ఇప్పటిదాకా నిషిద్ధం.
గాంధీ హత్యతోపాటు వివిధ కారణాల వల్ల ఉద్యోగులు RSS కార్యకలాపాల్లో పాల్గొనకుండా 1966 నవంబరు 30న అప్పటి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వీటిని కంటిన్యూ చేస్తూ 1970 జులై 25న.. తిరిగి 1980 అక్టోబరు 28న ఆర్డర్స్ వచ్చాయి. అయితే ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఈనెల 9న కేంద్ర వ్యక్తిగత ఫిర్యాదులు, శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ(DOPT) ఆదేశాలు వెలువరించింది.
ఈ నిర్ణయంపై MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇదే నిజమైతే భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వానికి మచ్చ అవుతుందని.. ఇది రాజ్యాంగాన్నే కాదు జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని అవమానపరచడమేనని ‘X’లో ట్వీట్ చేశారు. ఇక నుంచి RSSలో పాల్గొనే ఏ సివిల్ సర్వెంటూ దేశానికి కాకుండా సంఘ్ కు నిబద్ధుడుగా ఉంటారని విమర్శించారు.