అండమాన్-నికోబార్ దీవుల(Islands) రాజధాని(Capital) పోర్ట్ బ్లెయిర్ పేరును ‘శ్రీ విజయపురం’గా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈస్టిండియా కంపెనీ కాలంలో బ్రిటిష్ నావికాదళానికి చెందిన కర్నల్ అర్కిబాల్డ్ బ్లెయిర్ పేరుతో పోర్ట్ బ్లెయిర్ గా నామకరణం చేశారు. ఈ పేరు వలసవాద పోకడలకు గుర్తుగా ఉందని, అందుకే స్వాతంత్ర్య సంగ్రామంలో విజయానికి గుర్తుగా ‘శ్రీ విజయపురం’గా మార్చినట్లు హోంమంత్రి అమిత్ షా ‘X’ ద్వారా ప్రకటించారు.
ఈ దీవులు స్వాతంత్ర్య పోరాటానికి నిలయమని, చోళ సామ్రాజ్యం(Empire)లోనూ సముద్రయానానికి కీలకంగా పనిచేసిందని అమిత్ షా గుర్తు చేశారు. మన వ్యూహాత్మక ప్రదేశాల్లో ఈ దీవులు అత్యంత ప్రధానమైనవి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం, వీర సావర్కర్ వంటి వీరయోధులు జైలు నుంచే పోరాటం చేయడం ‘శ్రీ విజయపురం’ ప్రత్యేకత. ఇరుకుగా ఉండే రూముల్లోనే ఎక్కువ మందిని బంధించారు బ్రిటిష్ పాలకులు.