‘నీట్(NEET)’ పరీక్షల్లో అవకతవకలు, యూజీసీ-నెట్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న వేళ పారదర్శకత(Transparency) కోసం ఉన్నతస్థాయి(High Level) కమిటీ ఏర్పాటైంది. ఇస్రో మాజీ ఛైర్మన్ డా. కె.రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. పరీక్షల నిర్వహణలో పాటించాల్సిన సంస్కరణలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది.
ఏడుగురు వీరే…
రాధాకృష్ణన్ ఛైర్మన్ గా గల కమిటీలో డా. రమణ్ దీప్ సింగ్ గులేరియా, ప్రొ. బి.జె.రావు, ప్రొ. రమణమూర్తి కె., పంకజ్ బన్సల్, ఆదిత్య మిట్టల్, గోవింద్ జైస్వాల్ సభ్యులుగా ఉంటారు. నీట్, UGC-NET పరీక్షలపై గందరగోళం నెలకొన్న వేళ భవిష్యత్తులో నిర్వహించాల్సిన ఎగ్జామ్స్ కు సంబంధించి ప్రవేశపెట్టే సంస్కరణల(Reforms)పై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది.
ఉన్నత విద్యాశాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)కు సంబంధించి కేంద్ర విద్యాశాఖకు సంస్కరణల్ని కమిటీ తెలియజేస్తుంది. రెండు నెలల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని కమిటీకి కేంద్ర సర్కారు లక్ష్యం నిర్దేశించింది.