నాగపూర్లో జరిగిన అల్లర్లు ముందస్తు ప్రణాళికలో భాగమేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ‘ఛావా(Chhava)’ సినిమాతో ఉద్వేగాలు పెరిగాయని, అది కూడా ఒక కారణమని గుర్తు చేశారు. ఔరంగజేబ్ సమాధి తొలగిస్తున్నారన్న ఊహాగానాల(Speculations)తో నాగపూర్ రణరంగంగా మారింది. ఇరువర్గాలు దాడులకు పాల్పడటంతో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవిత కథతో 5 వారాల క్రితం విడుదలైన ‘ఛావా’.. దేశవ్యాప్తంగా ఆదరణ పొందింది. శంభాజీపై ఔరంగజేబ్ పాల్పడ్డ క్రూర దౌర్జన్యాలను వర్ణించడంతో భావోద్వేగాలు పెరిగాయి.