కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) రాజీవ్ కుమార్.. అరుదైన రికార్డు నెలకొల్పారు. తన హయాం(Term)లో ఇంచుమించు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించిన ఘనతను దక్కించుకున్నారు. 2022 మే 15న 25వ CECగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2025 ఫిబ్రవరి వరకు పదవిలో ఉంటారు. ఈయన బిహార్, జార్ఖండ్ కేడర్ కు చెందిన IAS అధికారి.
రాష్ట్రాల శాసనసభలకే కాకుండా మొన్నటి లోక్ సభ సహా రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు కూడా నిర్వహించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదైన 2022లోనే రాష్ట్రపతి(President), ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి.