తక్కువ వ్యవధిలో వరుసగా విరుచుకుపడుతున్న ‘క్లౌడ్ బరస్ట్’తో రాష్ట్రాలు అల్లకల్లోమవుతున్నాయి. అకస్మాత్తు కుంభవృష్టితో ఉత్తర భారతం వణికిపోతోంది. దేవభూమిగా ప్రసిద్ధి చెందిన ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్(Rudraprayag), ఛమోలీ జిల్లాల్లో తలెత్తిన వరదల్లో పెద్దసంఖ్యలో చిక్కుకుపోయారు. ఛమోలీ(Chamoli) జిల్లాలో గత వారమే ‘క్లౌడ్ బరస్ట్’ ఏర్పడి భారీ నష్టం జరిగింది. మణిమహేశ్ యాత్రకు వెళ్తూ చిక్కుకున్న 8 వేల మంది భక్తుల్ని రక్షించారు. ఈ విపత్తుకు ఇళ్లు, ఆఫీసులు అన్నీ కొట్టుకుపోయినట్లు CM పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. గత కొద్దిరోజులుగా జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ‘క్లౌడ్ బరస్ట్’లు కలకలం రేపుతుండగా, ఇప్పుడు ఉత్తరాఖండ్ లోనూ అదే తీరు.