UP తరహాలో మహారాష్ట్ర(Maharastra)లోనూ బుల్డోజర్ యాక్షన్ కు రెడీగా ఉన్నామని CM ఫడ్నవీస్ అన్నారు. నాగపూర్ మతఘర్షణలపై ఆయన హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు. ‘జరిగిన నష్టాన్ని అల్లరి మూకల నుంచే వసూలు చేస్తాం.. ఇందుకోసం బుల్డోజర్లను పనిచెప్తాం..’ అని వార్నింగ్ ఇచ్చారు. ఔరంగజేబ్ సమాధి కూలుస్తున్నారంటూ ఈనెల 17న నాగపూర్లో విధ్వంసం సృష్టించారు. రాళ్ల దాడి, వాహనాలు, ఆస్తుల ధ్వంసంపై సర్కారు సీరియస్ గా ఉంది. CCTVల ఫుటేజ్ ఆధారంగా ఇప్పటికే 104 మందిని అరెస్టు చేసి 68 సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేశారు.