రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీలు, తాజా(Latest) పరిస్థితులకు సంబంధించిన కేటాయింపులు జరపాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ పెండింగ్(Pending) అంశాలపై విజ్ఞాపనలు అందించారు.
అంశాలివే…
* వేలం లేకుండా గోదావరి పరిసరాల్లో సింగరేణికి బొగ్గు గనులు కేటాయించడం
* గతంలో మాట ఇచ్చిన విధంగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(IIM) కేటాయించాలి
* విభజనకు ముందు హామీ ఇచ్చిన I.T.I.R. సాకారం
* ప్రతి జిల్లాకు నవోదయ, కస్తూర్బా పాఠశాలలు నెలకొల్పాలి..
* రక్షణ శాఖ భూములకు సంబంధించిన గతంలో ఇచ్చిన ప్రతిపాదనల పరిశీలన
* కేడర్ బలోపేతానికి గాను రాష్ట్రానికి మరింత మంది సివిల్ సర్వీసెస్(IAS, IPS) అధికారులు
* రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులుగా అప్డేట్
* రీజినల్ రింగ్ రోడ్డు విషయంలో ఉత్తర, దక్షిణ భాగాలకు ఒకటే నంబర్ కేటాయించడం…
* యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసేందుకు సహకారం
* సైబర్ సెక్యూరిటీ విషయంలో కొత్త విధానాలపై కో-ఆపరేషన్
* పేద లబ్ధిదారులకు 25 లక్షల ఇళ్ల మంజూరు