రూ.10 వేల కోట్లు ఇచ్చినా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేది లేదంటూ తమిళనాడు(Tamilnadu) ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కరాఖండీగా చెప్పేశారు. తాము ఏ భాషకు వ్యతిరేకం కాదంటూనే బలవంతంగా హిందీ ప్రయోగిస్తే సహించేది లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, సామాజిక న్యాయ వ్యవస్థపై నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(NEP) తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. 3, 5, 8 తరగతులకు పబ్లిక్ పరీక్షల్ని ప్రతిపాదించడం.. ఆర్ట్స్, సైన్స్ కాలేజీల అడ్మిషన్ల కోసం సాధారణ ప్రవేశ పరీక్ష వంటివి విద్యా విధానాన్ని దెబ్బతీస్తాయన్నారు. NEPని తమిళనాడు అమలు చేయకపోతే రూ.2 వేల కోట్లు నిలిపివేస్తామని కేంద్రం ఇప్పటికే బెదిరించిందని ఆరోపించారు. NEPని అనుమతించి తమ రాష్ట్రాన్ని 2 వేల సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్లే పాపానికి పాల్పడనంటూ స్టాలిన్ మాట్లాడారు.