ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టుకు సిఫార్సు చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, పట్నా హైకోర్టు CJ విపుల్ మనుభాయ్ పంచోలి పేర్లను సిఫార్సు చేసింది. జస్టిస్ అరాధే(Aradhe) స్వరాష్ట్రం మధ్యప్రదేశ్ కాగా, జస్టిస్ పంచోలి(Pancholi) గుజరాత్ కు చెందినవారు. 34 మంది జడ్జిల సుప్రీంలో రెండు ఖాళీలున్నాయి. రిటైరైన జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సుధాంశు ధులియా స్థానాల్లో వీరి నియామకాలు ఉంటాయి. అరాధే గతంలో తెలంగాణ హైకోర్టు CJగా పనిచేశారు. కొలీజియం సిఫార్సుల్ని కేంద్రం ఆమోదించాక రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.