‘ఆపరేషన్ సిందూర్’ను కళ్లకు కట్టిన కర్నల్ సోఫియా ఖురేషి(Sofia Qureshi).. దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడామె తల్లిదండ్రులు మోదీ ర్యాలీకి హాజరై ప్రధానిపై పూలు చల్లారు. రెండ్రోజుల టూర్ కు గుజరాత్ చేరుకున్న మోదీకి దారిపొడవునా వేలాది జనం పూల వర్షం కురిపించారు. కర్నల్ తల్లిదండ్రులు తాజ్ మహ్మద్, హలీమాతోపాటు సోఫియా కవల సోదరి.. మోదీని చూసేందుకు ఉత్సాహంతో అక్కడకు వచ్చారు. తమ కూతురు దేశానికి సేవ చేయడం గర్వకారణమని, ఇలా ర్యాలీ ద్వారా ప్రధానిని కలుసుకోవడం ఆనందాన్నిచ్చిందని తాజ్-హలీమా జంట అన్నారు.