తాజా ఉద్రిక్త పరిస్థితుల్ని పర్యవేక్షిస్తూ దేశానికి సమాచారమిస్తున్న ఆర్మీ కర్నల్ సోఫియా ఖురేషి ప్రస్తావన సుప్రీంకోర్టులో వచ్చింది.
ఏం జరిగిందంటే…
శాశ్వత కమిషన్ కాకుండా మహిళా అధికారుల సర్వీస్ తొలగింపుపై 69 మంది పిటిషన్లు వేశారు. ‘వారంతా తెలివైనవారు.. వారి సేవల్ని మరోచోట వాడండి.. కోర్టుకు తిరగాలని చెప్పే టైమ్ కాదిది..’ అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ బెంచ్ స్పష్టం చేసింది. ఏటా 250 మందే కావాలని, స్టే ఇవ్వొద్దంటూ కేంద్రం తరఫున ASG ఐశ్వర్య కోరారు. పిటిషనర్ల తరఫున మేనక వాదిస్తూ… మే 7, 8న ఆపరేషన్ సిందూర్ పై మీడియాకు తెలిపిన కల్నల్ ఖురేషిని ప్రస్తావించారు. దీనిపై గతంలో ఖురేషి ఇదే కోర్టుకు వచ్చారని, ఇప్పుడామె దేశాన్ని గర్వపడేలా చేశారన్నారు. ఈ కేసు సరైందేనంటూ మహిళల ఘనతల్ని బెంచ్ కొనియాడింది. సైన్యంలో అన్ని పోస్టుల్లో మహిళల్ని మినహాయించడం సమర్థనీయం కాదంటూ 2020 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.