‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ తీసుకురావాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు ఫస్ట్ మీటింగ్ పెట్టుకుంటోంది. మాజీ ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ నివాసంలో ఈ భేటీ జరగనుంది. 8 మంది సభ్యులు, ఇద్దరు ఆహ్వానితులతో కూడిన కమిటీ.. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుండగా.. సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి వైదొలగడంతో మొత్తం తొమ్మిది మంది దీనికి అటెండ్ అవుతున్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో జీ20 సమావేశాలు, 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు పార్లమెంటు సమవేశాలు ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా చర్చకు కారణమైన జమిలి ఎన్నికలపై ఈ తొలి మీటింగ్ లో ఏం నిర్ణయాలు తీసుకుంటారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ పేరు కూడా మార్చే యోచనలో కేంద్రం ఉండటంతో.. ఇప్పుడీ జమిలి ఎన్నికలపై నిర్వహించే మీటింగ్ ఎలా ఉంటుందన్నది తెలియాల్సి ఉంది. వచ్చే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే ‘రిపబ్లిక్ ఆఫ్ భారత్’ పేరుతో రాజ్యాంగాన్ని సవరిస్తారన్న మాటలు వినపడుతుండగా.. జమిలి ఎన్నికలపైనా ఆర్టికల్స్ ను సవరించేలా నిర్ణయాలు ఈ కమిటీ తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా తయారైంది.