ముఖ్యమంత్రి పీఠానికి పోటీ ఏర్పడ్డ వేళ కర్ణాటక CM సిద్ధరామయ్య సంచలన రీతిలో మాట్లాడారు. హైకమాండ్ ఆశీస్సులు లేకపోతే పదవే ఉండదని NDTVకి ఇచ్చిన ఇంటర్వూలో అన్నారు. 2023లో పగ్గాలు చేపట్టిన ఆయన.. ఐదేళ్ల పాటు పదవిలో ఉండాలంటే అధిష్ఠానం అండ ఉండాల్సిందేనని కరాఖండీగా చెప్పేశారు. CM పదవిని సిద్ధరామయ్య నుంచి డి.కె.శివకుమార్ ఆశిస్తున్నట్లు ముందునుంచి ప్రచారం ఉంది. ‘నాయకత్వ సమస్య సద్దుమణిగింది.. నాకు హైకమాండ్ ఫుల్ సపోర్ట్ ఉంది.. అదే లేకపోతే నేనీ పదవిలో కొనసాగను.. CM పదవికి 50-50 ఫార్ములా లేదు.. నేనే కర్ణాటక ముఖ్యమంత్రిని..’ అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.