రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుపుతున్న వజ్రోత్సవ వేడుకలు ఏడాది పాటు నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. ఈ వజ్రోత్సవాల వేళ ‘http://constitution75.com’ పేరిట ప్రత్యేక వైబ్సైట్(Website)కు రూపకల్పన చేసింది. రాజ్యాంగ పరిషత్తు చర్చలు, నివేదికలు అందుబాటులో ఉంచడంతోపాటు పిల్లల్లో అవగాహన కల్పించాలని సూచించింది.
పాఠశాలలు సహా రాజ్యాంగ ప్రవేశిక సామూహిక పఠనాల్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నిర్వహించడంతోపాటు ఆ వీడియోల్ని వెబ్ సైట్లో అప్ లోడ్ చేసే వీలు కల్పించింది. వెబ్ సైట్లో వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా సర్టిఫికెట్లు కూడా పొందవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యాంగ దినోత్సవం కేవలం పార్లమెంటులోనే జరిపే వేడుక కాదని, దేశం మొత్తం నిర్వహించాల్సిన పండుగ అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గుర్తు చేశారు.