అక్రమాలకు పాల్పడే రాజకీయ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) పెట్టే కేసుల్లో శిక్షలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. 2015-16 నుంచి 2024-25 వరకు దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా 193 మందిపై కేసుల్ని నమోదు చేసింది. 2022-23లో అత్యధికంగా 32.. 2019-20, 2021-22 సంవత్సరాల్లో 26 మంది చొప్పున కేసులు ఫైల్ అయ్యాయి. కానీ ఈ 193 కేసుల్లో కేవలం రెండింట్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధురి రాజ్యసభలో ప్రకటించారు. మోదీ తొలి టర్మ్ లో 42 మందిపై.. రెండో టర్మ్ లో 138 మంది నేతలపై కేసులు నమోదయ్యాయి. సరైన ఆధారాల్లేకుండా రాజకీయ కక్షతోనే ED దాడులకు దిగుతోందంటూ CPM ఎంపీ AA రవి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.