CPM ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత సీతారాం ఏచూరి కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఈ ఆగస్టు 19 నుంచి ఢిల్లీ ఎయిమ్స్(AIIMS)లో చికిత్స తీసుకుంటున్న ఆయన.. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. 1952 ఆగస్టు 12న చెన్నైలో తెలుగు కుటుంబంలో జన్మించిన ఆయన.. హైదరాబాద్ లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నారు.
ఏచూరి తల్లిదండ్రులది ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ. CPM స్టూడెంట్స్ యూనియన్ అయిన SFIలో ఏచూరి 1974లో చేరి… 1984లో CPM కేంద్ర కమిటీలో చోటు దక్కించుకున్నారు. 2005 నుంచి 2017 వరకు బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.