ఆలయ వేడుకల్లో(Celebrations) ప్రమాదవశాత్తూ టపాసులు(Crackers) పేలి 150 మంది గాయాల పాలైతే అందులో 10 మంది పరిస్థితి సీరియస్ గా ఉంది. ఒక టపాసు ఎగిరిపడి షెడ్డుకు అంటుకుని, బాణసంచా నిల్వ చేసిన ప్రాంతంలో పడటంతో ఒక్కసారిగా భారీగా మంటలు వచ్చాయి. భయంతో అందరూ పరుగులు తీయడంతో కేరళలోని కాసరగోడ్ జిల్లాలో భయానక పరిస్థితి ఏర్పడింది. ఉత్తర మలబారు ప్రాంతంలో జరిపే ‘అంజూతంబలమ్ వీరెకవు’ ఉత్సవాల్లో భాగంగా అర్థరాత్రి దాటిన తర్వాత ఘటన జరిగింది.
షెడ్డు పక్కనే పెద్దసంఖ్యలో జనం ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ కమిటీకి చెందిన ఇద్దరు ఆఫీస్ బేరర్లను పోలీసులు అరెస్టు చేశారు. బాణసంచాను 100 మీటర్ల దూరంలో నిల్వ చేసి ఉండాల్సిందని కాసరగోడ్ కలెక్టర్ కె.ఇన్బశేఖర్ అన్నారు.