
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆప్ MP సహా పలువురు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. పేరు ప్రస్తావించకున్నా.. కేజ్రీవాల్ ను వ్యతిరేకించే మహిళ అన్నారు. BJP రూ.20 కోట్ల చొప్పున ఆఫర్ చేసిందన్నారు. ఎవరు ఎవరికి ఓటేశారో ECకి తెలుసు, దాన్ని బయటపెట్టాలని సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. ఓటింగ్ వరకు NDAకి 438, ఇండీ కూటమికి 315 మంది అని భావించారు. కానీ రాధాకృష్ణన్ కు 452, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. పోలైన 767లో చెల్లనివి 15 ఉన్నాయి. చెల్లనివి ఏవి, క్రాస్ ఓటింగ్ చేసిందెవరన్నదానిపై తలలు బద్ధలు కొట్టుకుంటున్నారు. విపక్ష కూటమిలో ముందునుంచీ సఖ్యత లేకపోవడమే కారణమంటున్నారు.