మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి(Tomb) తొలగిస్తున్నారన్న ప్రచారంతో మహారాష్ట్ర నాగపూర్ లో ఘర్షణలు జరగడంతో కర్ఫ్యూ విధించారు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని 17వ శతాబ్దపు సమాధి వివాదంపై సోమవారం రాత్రి ఒక వర్గం వ్యక్తులు రోడ్లపైకి వచ్చి దాడులకు దిగారు. రెండోవర్గం సైతం ఎదురుదాడికి దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. రాళ్లు విసిరి, వాహనాలకు నిప్పు పెట్టి, ఇళ్లపై దాడులకు పాల్పడటంతో పరిస్థితి చేయిదాటింది. గణేశ్ పేట్, తెహ్సీల్, లకడ్ గంజ్, పచ్ పవోలి, శాంతినగర్, సకర్దర, నందనవన్, ఇమాన్ వాడ, యశోధరనగర్, కపిల్ నగర్ ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలవుతోంది.