పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. కాంగ్రెస్ MP కుర్చీ(Chair) వద్ద నోట్లు కనిపించాయి. దీనిపై అధికార పార్టీ BJP తీవ్ర విమర్శలు చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేయగా, దీనిపై తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. దీంతో జరిగిన ఘటనపై ఛైర్మన్ జగదీఫ్ ధన్కడ్ విచారణకు ఆదేశించారు. సాధారణ చెకింగ్ లో భాగంగా MP అభిషేక్ మను సింఘ్వీ కూర్చునే 222 సీటు కింద కరెన్సీ నోట్లు కనిపించాయి. ఆయన తెలంగాణ నుంచే ఎగువసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ విషయంలో సింఘ్వీ పేరును ప్రస్తావించడంపై ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు.