
ప్రజలకు భద్రత కల్పించాల్సిన కేంద్ర హోంశాఖలోని ఉద్యోగుల్లోనే అత్యంత అవినీతిపరులున్నట్లు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(CVC) నివేదికలో బయటపడింది. ఇక రెండు, మూడు స్థానాల్లో సీరియల్ గా రైల్వే, బ్యాంకులు ఉన్నాయట. గతేడాది వచ్చిన కంప్లయింట్స్ కు సంబంధించి CVC.. ఈ రిపోర్ట్ తయారు చేసింది. గత సంవత్సరం అన్ని డిపార్ట్ మెంట్లకు సంబంధించి 1.15 లక్షలకు పైగా కంప్లయింట్లు అందగా.. వాటిలో 85 వేలకు పైగా ఫిర్యాదుల్ని పరిష్కరించినట్లు తెలిపింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ డిపార్ట్ మెంట్లను పరిశీలిస్తే హోంశాఖ ఉద్యోగులే ఎక్కువగా అవినీతికి పాల్పడ్డట్లు.. వీరిపై ఏకంగా 46 వేలకు పైగా కంప్లయింట్లు వచ్చినట్లు CVC స్పష్టం చేసింది. ఇక రైల్వే ఎంప్లాయిస్ పై 10,850 కంప్లయింట్స్ వస్తే అందులో 9,663 క్లియర్ అయినట్లు తెలిపింది. బ్యాంకులపై 8,129 ఫిర్యాదులు రాగా.. అందులో 7,792 పరిష్కారమయ్యాయట.
ఇలా మూడు ప్రధాన డిపార్ట్ మెంట్లలోనే ఈ స్థాయిలో కంప్లయింట్లు రావడం ఆశ్చర్యకరంగా మారింది. అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నా… అమ్యామ్యాల్లో కూరుకుపోయిన ఉద్యోగుల వల్ల శాఖల పరువు పోవాల్సి వస్తోంది. వీరిపై కఠిన చర్యలు తీసుకోకపోతే చివరకు కేంద్ర ప్రభుత్వంపైనే విమర్శలు వచ్చే ప్రమాదం ఉంది.