వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్ కు రూ.2 చొప్పున పెంచిన కేంద్రం… గ్యాస్ ధరలపై కూడా నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఉజ్వల గ్యాస్ వినియోగదారులకు వర్తిస్తుంది. ఈ లెక్కన ఒక్కో సిలిండర్ పై రూ.50 దాకా పెరుగుతుంది. రూ.500 ఉన్న సిలిండర్ ధర రూ.550… రూ.803 గల గ్యాస్ రూ.853 అవుతుందని పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు.