ఉద్యోగులకు DA(Dearness Allownce) పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పెంచిన 2% DA ఉద్యోగులు, పెన్షనర్లు కోటి మందికి అందనుంది. ఇది 2025 జనవరి 1 నుంచి వర్తించనుండగా.. తాజా నిర్ణయంతో 53% నుంచి 55 శాతానికి పెరుగుతుంది. 15-20 రోజుల నుంచి ప్రకటన ఉంటుందని భావించగా, కేబినెట్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెల జీతంతో కొత్త DA కలుస్తుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఏటా హోలీ, దీపావళి పండుగలకు ముందుగానే DAను పెంచుతుండగా.. ఈసారి కొంచెం ఆలస్యమైంది. రూ.18,000 బేసిక్ పే గల ఉద్యోగి ఇప్పటివరకు రూ.9,540 అందుకుంటే 2% పెరుగుదలతో అది రూ9,900 అవుతుంది. 2018 నుంచి గత ఏడేళ్లలో ఇదే అత్యల్పం. ఇంతకుముందు డీఏ(3%)ను 2024 జులైలో ప్రకటించింది కేంద్రం. మరిన్ని అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి… https://justpostnews.com