కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు.. దీపావళి సందర్భంగా శుభవార్త అందజేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 3 శాతం కరవు భత్యాన్ని(DA) పెంచుతూ మంత్రివర్గం(Cabinet) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మూల వేతనంలో 50 శాతం ఉన్న DA ఇక 53 శాతానికి పెరుగుతుంది. ఈ జూలై 1 నుంచి దీన్ని వర్తింపజేస్తుండగా.. సర్కారు నిర్ణయంతో కోటి మందికి మేలు కలిగిస్తూ రూ.9,448 కోట్ల భారం పడనుంది.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆలిండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్(AICPI) ఆధారంగా ఏటా రెండుసార్లు DA పెరుగుతుండగా.. మొన్నటి సార్వత్రిక(General) ఎన్నికలకు ముందు మార్చిలో 4% DAను పెంచింది. అది 2024 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. రైతుల కోసం ‘పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్’కు రూ.35 వేల కోట్లు కేటాయించింది.