
ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. రోజులు గడుస్తున్న కొద్దీ అత్త, మామ వేధింపులు ఎక్కువయ్యాయి. కొడుకు పుట్టాక ఇంకా శృతిమించాయి. బాధ తట్టుకోలేక విడాకులకు అప్లై చేసుకుని అనుకున్నది సాధించింది. దీంతో కూతురు తమ ఇంటికి వస్తుందని బాధపడే తల్లిదండ్రులకు భిన్నంగా ఆ పేరెంట్స్ ఆమెను బ్యాండ్ బాజాలతో ఘనంగా ఊరేగించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన జ్ఞానేంద్ర శర్మ కుమార్తె ప్రణీతకు 2018లో ఆర్మీ మేజర్ తో వివాహమైంది. సైకాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ప్రణీత ఓ జ్యుడీషియల్ అకాడమీలో ఫైనాన్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇన్నేళ్లు నరకం అనుభవించానని, ఇప్పుడు దాన్నుంచి బయటపడ్డానని ఆమె ఆవేదనతో చెప్పింది.