ఎన్నికలకు ముందు మరోసారి సమావేశమైన కేంద్ర మంత్రి మండలి(Union Cabinet).. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు 4% డీఏ(Dearness Allowance)ను పెంచింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 68 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఈ పెంపు(Hike)తో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకున్నట్లు మోదీ సర్కారు ప్రకటించింది.
12,868 కోట్ల భారం…
డీఏతోపాటు అడిషనల్ సౌకర్యాలైన ఇంటి అద్దె భత్యం(House Rent Allowance)ను కూడా పెంచింది. ఈ హైక్ ద్వారా దేశ ఖజానాపై ప్రతి సంవత్సరం రూ.12,868 కోట్ల భారం పడనుంది. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్(CPI) డేటా ప్రకారం ఈ మేరకు డీఏను ఇస్తున్నట్లు కేబినెట్ తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వ ఏడో పే కమిషన్ సూచనలు, లేబర్ బ్యూరో సిఫార్సుల ఆధారంగా ఉద్యోగులు బెనిఫిట్స్ ను ప్రకటించింది. 2024 జనవరి నుంచి ఇది అమలులోకి రానుంది. 2023 అక్టోబరులో DA పెంచగా దాని శాతం 46కు చేరింది. అప్పుడు కూడా ఇదే రీతిలో 4% DAను ప్రకటించి ఉద్యోగుల జీతాల్లో కలిపారు.