గుజరాత్ లోని వడోదర(Vadodara) వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. ఇప్పటికీ ఒకరి ఆచూకీ దొరకలేదు. ఆనంద్-వడోదరను కలిపే గంభీర బ్రిడ్జి నాలుగు దశాబ్దాల నాటిది. బుధవారం ఇది ఉన్నట్టుండి కూలిపోయి వాహనాలు అందులో పడిపోయాయి. తొలిరోజు 12, రెండోరోజు 6 మృతదేహాల్ని నది నుంచి బయటకు తీశారు. ఆర్ అండ్ బీ శాఖకు చెందిన నలుగురు ఇంజినీర్లను CM భూపేంద్ర పటేల్ సస్పెండ్ చేశారు. ఉన్నతస్థాయి కమిటీ వేసి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 7 వేల వంతెనల్ని పరిశీలించిన సర్కారు.. పాతబడ్డ వాటికి రిపేర్లు చేయిస్తోంది.