తెలంగాణ అప్పుల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. MP నామా నాగేశ్వర్ రావు అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2019-20 నుంచి 2022-23 వరకు వివిధ రాష్ట్రాల అప్పులను తెలియజేశారు. 2019 మార్చి నాటికి రాష్ట్ర అప్పు రూ.1,90,203 కోట్లు కాగా.. 2020 మార్చికి రూ.2,25,418 కోట్లని తెలిపారు. 2021 మార్చి నాటికి రాష్ట్ర అప్పు రూ.2,71,259 కోట్లుగా.. 2022 మార్చి నాటికి రూ.3,14,136 కోట్లుగా… 2023 రాష్ట్ర బడ్జెట్ అంచనా ప్రకారం రూ.3,66,306 కోట్లు అని నిర్మల స్పష్టం చేశారు.