
భారతీయ దీపాల పండుగ దీపావళికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సాంస్కృతిక వారసత్వ పండుగగా యునెస్కో గుర్తించింది. 2025కు గాను ప్రపంచవ్యాప్తంగా మరో 19 శాస్త్రీయ, సంప్రదాయ వేడుకల్ని ప్రకటించింది. దీపావళితోపాటు ‘తంగైల్’ సంప్రదాయ చీర నేత కళ కూడా జాబితాలో చోటు దక్కించుకుంది. పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న సంప్రదాయాలు తదుపరి తరాలకు వారధి అని యునెస్కో తెలిపింది. ఈ గుర్తింపు పట్ల ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేసింది.